ఢిల్లీ హైకోర్టు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసిన తరువాత, తనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న ఆలోచనలో పడ్డ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం, సుప్రీంకోర్టులో పరుగులు పెట్టారు. సీబీఐ, ఈడీ అధికారులు తన వద్దకు వస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న ఆయన, ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ వెంటనే తదుపరి కర్తవ్యం ఏంటని పార్టీ సహచరుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించారు. ఆ సమయంలో కోర్టులోనే మరో ప్రాంతంలో ఉన్న కపిల్ సిబల్, వెంటనే చిదంబరం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారు ఇరువురూ కోర్టు హాల్ లో అటూఇటూ హడావుడిగా తిరగడం కనిపించింది.
ఆపై చిదంబరం తన మెదడుకు పనిపెట్టారు.
శరవేగంగా ఆలోచించి, కోర్టు వ్యవహారాలు బాగా తెలిసిన ఓ అధికారిని కలిశారు. మంగళవారం కేసు విచారణ కుదరలేదు కాబట్టి, బుధవారం తొలి గంట వ్యవధిలోనే అపీలును కోర్టు విచారించేలా రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సూర్య ప్రతాప్ సింగ్ కు పిటిషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతో వారు స్వయంగా రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి ఆ పిటిషన్ ను ఇచ్చారు.మామూలుగా అయితే, అత్యవసర పిటిషన్లను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తే రోజువారీగా నిర్ణయిస్తారు. కానీ, నేడు అయోధ్య కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉండటం, రాజ్యాంగ ధర్మాసనంలో రంజన్ గొగొయ్ బిజీగా ఉంటారు కాబట్టి, ఈ పిటిషన్ ను పరిశీలించే బాధ్యత జస్టిస్ ఎన్వీ రమణకు అప్పగించవచ్చని భావిస్తున్నారు.
మొత్తానికి రజినీకాంత్ తప్పించుకున్నారు… విజయ్ ఇరుక్కున్నారు… డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు