telugu navyamedia
రాజకీయ వార్తలు

ఐఏఎస్ లు ముఖ్య పాత్ర నిర్వహించాలి: నితిన్ గడ్కరీ

nitish gadkari to hyderabad today

ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఐఏఎస్ అధికారులు ముఖ్య పాత్ర నిర్వహించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వం ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడంలో వారి పాత్ర కీలకమని చెప్పారు. నాగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఖాస్దర్ క్రీడా మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైదానంలో ఆటగాళ్లతో కలిసి గడ్కరీ క్రికెట్ ఆడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వంలో పాజిటివ్ ధోరణితో ఉండాలన్నారు.

నిధులున్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందంటూ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో రూ.17లక్షల కోట్లకు సంబంధించిన పనులను తమ ప్రభుత్వం ప్రారంభించింద న్నారు. ఈ ఏడాది కనీసం రూ.5లక్షల కోట్లకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించలేదన్నారు. దీనికి కారణం నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడమేనని గడ్కరీ పేర్కొన్నారు.

Related posts