telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

భారీగా పెరిగిన ఓటు నమోదు.. ఏపీలో 15 లక్షల కొత్త ఓట్లు..

ec on voter id card and voting

ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా, ఆ సమయానికి ఓటర్ల సంఖ్య 3.95 కోట్లను అధిగమిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. 2014 ఎన్నికల సమయానికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పుడా సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగి 3.84 కోట్లకు చేరిందని, ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా ప్రకటించే సమయానికి మరో 9.5 లక్షల ఓట్లు కలిసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఏపీ ఓటర్ల జాబితాలో 1.55 లక్షల ఓట్లను తొలగించామని, తమకు తాజాగా 10,62,441 దరఖాస్తులు రాగా, అందులో 9.5 లక్షల వరకూ చేర్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తుది జాబితా ప్రకటించే సమయానికి 3.95 కోట్ల మంది ఓటర్లు ఉండవచ్చని అన్నారు. కొత్తగా ఓటర్లుగా చేరిన వారికి ఫోటో ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీని ఏప్రిల్‌ 5లోగా పూర్తి చేస్తామని అన్నారు.

Related posts