telugu navyamedia
రాజకీయ

దీపాకే జయలలిత వేదనిలయం..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత నివాసంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వేదనిలయాన్ని ఆమె మేనకోడలు దీపాకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ఇదివరకు జయలలిత నివాస స్థావరాన్ని స్మారక భవనంగా మార్చాలని అన్నా డియంకె ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకునే వీల్లేదని హైకోర్టు అభిప్రాయపడింది. జయలలితకు 913 కోట్ల రూపాయలమేర స్థిర, చరాస్తులున్నట్లు లెక్కగట్టారు. జయలలిత ఆకస్మిక మరణానంతరం ఆస్తులు ఎవరికి చెందుతాయనే అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు తీర్పుతో ఆమె మేనకోడలు దీపకు జయలలిత ఆస్తులు అప్పజెప్పబోతున్నారు.

Related posts