telugu navyamedia
రాజకీయ

తోలుబొమ్మల కళాకారుడు కు పద్మశ్రీ ..

అంకితం చేసే పని ఎప్పటికైనా గుర్తింపు , గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అంటారు. ఆ మాటలు నిజమని తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతి రావు నిరూపించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన దళవాయి చలపతి రావు జానపద కళాకారుడు . ఏడు దశాబ్దాల నుంచి తోలుబొమ్మలాట నే వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన జీవితంలో ఢిల్లీ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని కానీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును చలపతి రావు మంగళవారం రోజు అందుకున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చలపతి రావుకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.

ఉపరాష్ట్రపతి ఎమ్ . వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,, హోమ్ మంత్రి అమిత్ షా , ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మొదలైన వారి సమక్షంలో అతి సామాన్యమైన ఈ జానపద కాళాకారుడు పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. దళవాయి చలపతి రావు ఎంత నిరాడంబరుడంటే రాష్ట్రపతి భవన్ కు పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి వచ్చిన ఆయన ప్రధాన మంత్రిని ఆకట్టుకున్నారు , కారణం చలపతి రావు చెప్పులు కూడా లేకుండా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టారు .

ఢిల్లీలో ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకోవడంతో సుప్రసిద్ధ కళాకారుడు దళవాయి చలపతిరావు కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు. … ఓ కుగ్రామంలో పుట్టిన చలపతిరావు 66 ఏళ్లుగా తోలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో ఖ్యాతి గడించారు.

Related posts