telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫలించని నేతల బుజ్జగింపులు..పోటీకి సై అంటున్న అన్నదాతలు

1000 farmers from nijamabad to parlament

తెలంగాణ సర్కార్ పై ఆగ్రహంతో రగిలిపోతున్న నిజామాబాద్ రైతులు నేతల బుజ్జగింపులను పట్టించుకోలేదు. నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. లోక్ సభ ఎన్నికల బరిలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రైతులు పోటీకి సై అంటూ పోటీలో నిలిచారు. పసుపు ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కోసం పోటీకి దిగారు. అంతేకాదు ప్రధాన పార్టీల అభ్యర్థులకు రైతు సత్తా ఏంటో చూపించేందుకు పోరుబాటను మరింత ఉధృతం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గమంతటా బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణపై చర్చించేందుకు రైతులు నేడు సమావేశం కానున్నారు. నిజామాబాద్ నుంచి ఎన్నికల బరిలో 185 మంది అభ్యర్థులు మిగిలారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏడుగురు ఉండగా.. మిగతా 178 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారనుంది.

Related posts