telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్న జేజమ్మ..!

Anushka

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్ , తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా మరో సారి అనుష్క పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా మంచి సంబంధం కోసం చూస్తున్న స్వీటీ ఫ్యామిలీకి ఓ అబ్బాయి దొరికాడట. ఆ అబ్బాయి దుబాయికి చెందిన వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే స్వీటీ పెళ్లి చేయాలని.. అనుష్క ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. అయితే ఆ అబ్బాయి.. స్వీటీ కంటే చిన్నవాడనే రుమార్లు వస్తున్నాయి. ఒకవేళ అన్నీ కలిసివస్తే.. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయట. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అనేది.. తెలియాలంటే.. స్వీటీ ఓపెన్ అయ్యేవరకు అందరూ ఆగాల్సిందే.

Related posts