telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వంటేరును టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై బ్రేక్?

Onteru prathap reddy joins trs party?

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రతాప రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం సిద్ధపడినట్లు గురువారం సాయంత్రం వార్తలు వినిపించాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారేసరికి ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరే విషయం మలుపు తిరిగింది.

వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలను మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వంటేరు ప్రతాపరెడ్డి కావాలనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. వంటేరు టీఆర్ఎస్‌లోకి వస్తానని చెప్పినా కూడా పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని వంటేరును తమ పార్టీ నుంచి ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు. దీంతో వంటేరును టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై బ్రేక్ లు పడినట్లు తెలుస్తోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌కు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీనిచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రతాప్‌రెడ్డి, కేసీఆర్‌పై 15వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంటేరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత ఐదేళ్లపాటు ఆయన కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచీ కేసీఆర్‌కు దీటుగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏ మాత్రం తగ్గకుండా జోరుగా ప్రచారం చేశారు. అయినప్పటికి కేసీఆర్‌ చేతిలో ఓడిపోయారు.

Related posts