telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ వ్యాఖ్యలపై సౌదీ అరేబియా ఆగ్రహం

pakistan saudi arabiya

పాకిస్థాన్ కు మరోసారి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని పాక్ ఆరోపించింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని పాక్ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేసింది.

ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం కూడా ఉందని పాక్ విదేశాంగ మంత్రి బెదిరింపు స్వరం వినిపించారు. పాక్ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను నిర్మొహమాటంగా వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో, 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్ కు దూరం కానుంది.

Related posts