telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్ రాజ్‌కుమార్ ‘జేమ్స్’ మూవీ రిలీజ్ ..

*అప్పును త‌లుచుకుని ఫ్యాన్స్ భావోద్వేగం
*వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన జేమ్స్ మూవీ
*పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం ..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఈయన హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడంతో యావత్ సినీ పరిశ్రమను అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచి వెళ్ళిపోయారు.  త‌మ అభిమాన హీరో లేడన్న నిజాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Puneeth Rajkumar Last Movie James Release Date Update

పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ . ఈ సినిమా కోసం పునీత్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. చేతన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి17న పునీత్‌ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.

కర్నాటకలో ఎన్నడు లేని విధంగా 500 పైగా స్క్రీన్స్‌, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్‌ లో ఈ సినిమాను విడుదల చేశారు.

Teaser of Puneeth Rajkumar's last film 'James' creates sensation

తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున పేపర్లు జల్లుతూ, సినిమాను బరువెక్కిన గుండెలతో వీక్షిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

తెలుగు హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విల‌న్‌గా నటించారు. పునీత్ రాజ్‌కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటించారు. ఈ చిత్రంలో పునీత్‌కు వాళ్ల అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం జ‌రిగింది.

Related posts