telugu navyamedia
సినిమా వార్తలు

సెట్లో ఆడవారితో బాలకృష్ణ తీరు ఇదే… బాలకృష్ణ అభిమానికి “నో” చెప్పిన పాకీజా

Balakrishna-and-Vasuki

తెలుగులో “అసెంబ్లీరౌడీ”, “రౌడీ ఇన్‌స్పెక్టర్”, “పెదరాయుడు” చిత్రాల్లో ఆమె ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వాసుకీ. “అసెంబ్లీ రౌడీ”లో పాకీజా పాత్రలో కనిపించారు. దీంతో ఆమెను తెలుగు ప్రేక్షకులు పాకీజాగానే గుర్తు పెట్టుకున్నారు. తాజాగా వాసుకీ (పాకీజా) పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలను వెల్లడించారు ఆమె.

“మా అమ్మకు కేన్సర్ వచ్చింది. ఆమెను చూసుకునేందుకే టైమ్ సరిపోయేది. నా సంపాదన అమ్మకు వైద్యం చేయించేందుకే సరిపోయేది. చెల్లి పెళ్లి చేశా. కుటుంబ బరువు, బాధ్యతలు నాపై పడ్డాయి. నన్ను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదన అడిగితే చాలా కష్టం అవుతుంది. అందుకే పెళ్లి చేసుకోలేదు. అయితే తెలుగులో సినిమాలు చేసేటప్పుడు ‘ఐ లవ్యూ పాకీజా’ అని ఫోన్లు చేసేవారు. బాలకృష్ణ అభిమాని ఒకరు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం.. బాలయ్య అండగా ఉంటారు అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇప్పుడు హాయిగా ఉన్నా’’ అని వాసుకీ (పాకీజా) తెలిపారు.

ఇక హీరో బాలకృష్ణ అంటే తనకు ఇష్టమని చెప్పారు. సెట్‌లో ఆడవాళ్లతో చాలా మర్యాదగా ఉంటారని ఆమె తెలిపారు. అక్కా, చెల్లితో ఎలా ఉంటారో అదేవిధంగా ఆయన కూడా ఉంటారని చెప్పారు. ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు బాలకృష్ణ అందులో ఉన్నారని, ఆ సమయంలో తనూ ఉన్నట్లు పాకీజా తెలిపారు. ఆసమయంలో ఆర్టిస్టులందరికి బాలకృష్ణ ధైర్యం చెప్పారని ఆమె గుర్తు చేశారు. అప్పుడే బాలకృష్ణ తనకు పరిచయమైనట్లు పాకీజా చెప్పారు.

Related posts