telugu navyamedia
సినిమా వార్తలు

సన్ రైజర్స్ తరఫున నాని ఆట … : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం “జెర్సీ” శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌. ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో మంచి కలెక్షన్లతో థియేటర్లలో దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ టాక్‌తో తెచ్చుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే విమర్శకులతో పాటు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా నాని జెర్సీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ “జెర్సీ” టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

“జెర్సీ ప్రేమలో… అర్జున్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. క్లాప్స్ కొట్టించాడు. లీనమయ్యేలా చేశాడు. నానిపై ఎంతో ప్రేమ కలిగింది. గౌతమ్… మీలో ఉన్న నైపుణ్యానికి ఎంతగానో ఆనందపడుతున్నాను.”

గమనిక : సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం నాని ఆడొచ్చు. అద్భుతంగా ఆడాడు” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

Related posts