telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

నా ఆరోగ్యం చాలా బాగుంది.. నిర్ధారణ లేకుండా మీడియాలో వార్తలు: కృష్ణంరాజు

actor krishnam raju hospitalized

ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. వార్తలపై ఆయన స్పందిస్తూ..కేవలం న్యూమోనియా పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్లడం చూసిన కొన్ని పత్రికల వారు కనీస నిర్ధారణ లేకుండా వార్తలు రాశారని అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఓ ప్రకటన విడుదల చేశారు.

Related posts