telugu navyamedia
సినిమా వార్తలు

‘గని’ ట్రైలర్​ రిలీజ్ : సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది.

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Varun Tej: ట్రైలర్‌ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన గని | Varun Tej Ghani  Locks Trailer Release Date And Time

ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది.

ట్రైలర్ విషయానికొస్తే.. ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి.. ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది.. లైఫ్‌లో మంచొడిని గెలుకు..చెడ్డోడిని గెలుకు..కానీ నాలా ఆట‌ని గెలిపించాల‌నుకునే పిచ్చోడిని మాత్రం గెల‌క‌కు అంటూ చెప్పే డైలాగ్స్ నటన ఆకట్టుకుంటున్నాయి.

ఇక కోచ్ గా సునీల్ శెట్టి కనిపించగా, నదియా, వరుణ్ తల్లిగా కనిపించింది. ఇక జగపతి బాబు వరుణ్ తండ్రిగా కనిపిస్తున్నాడు..ఉపేంద్ర పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ సయీ మంజ్రేకర్ తో వరుణ్ కి మంచి లవ్ ట్రాక్ వారి కెమిస్ట్రీ బాగుంది. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్‏కు సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

Related posts