బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే పెళ్ళైనప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం దీపికా పదుకొణే మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చపాక్ అనే సినిమాలో నటిస్తుంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా నటిస్తుంది. జనవరి 10,2020న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు కపిల్ దేవ్ బయోపిక్ 83లోను దీపికా నటిస్తుంది. తాజగా ఈ బ్యూటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా సమక్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు బయటకి వచ్చాయి. “దీపిక వెన్నెముక కదలికను చూస్తుంటే, ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉందని నేను చెప్పగలను ! ఈ విషయాన్ని మేము అంగీకరించాము. మీరు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నాను” అని ఫిట్ నెస్ ట్రైనర్ తన కామెంట్ ద్వారా తెలిపాడు. ఈ కాలంలో హీరోయిన్లు ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడమే కాకుండా దానికి తగ్గట్లుగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. అంతేకాదు మంచి డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.
previous post