తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 సందడి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది. సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. బిగ్ బాస్-4లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అంతా సిద్ధం చేసుకొని 16మంది కంటెస్టెంట్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు బిగ్ బాస్ టీమ్. తాజాగా వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. కరోనా సోకిన వారిలో యూట్యూబర్ గంగవ్వ, ఒక యంగ్ సింగర్ తో పాటు మరొకరు ఉన్నారని తెలుస్తుంది. దాంతో బిగ్ బాస్ టీమ్ ఆందోళనలో ఉందట. ఇక కరోనా నేపథ్యంలో ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను కూడా ముందే ఎంచుకున్నారు నిర్వాహకులు. ముగ్గురిని రీప్లేస్ చేసి షోను మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.
next post