telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

లంగర్లకు చిక్కిన బోటు… వెలికి తీసేందుకు చురుగ్గా ప్రయత్నాలు… దొరికినట్టేనా ?

people rescue on boat accident got prize money

గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం ఘటనలో 33 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 14 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేేసినవా విపలమవుతున్నాయి. విపరీతమైన వర్షాలు, వరద ప్రవాహం, ఇరుకు ప్రాంతం, బోటు 210 అడుగుల లోతులో ఇరుక్కుపోవడం వంటి కారణాలు వెలికితీతకు ఆటంకాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌ను రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికి తీత పనులు ముమ్మరంగా చేపడుతోంది. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌లను ప్రొక్లెయినర్‌తో లాగుతోంది సత్యం బృందం. ప్రస్తుతం కచ్చులూరు వద్ద వర్షం పడుతోంది. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా బోటును వెలికితీత పనులను కొనసాగిస్తోంది సత్యం బృందం. ప్రొక్లెయినర్‌ సహాయంతో ఈ బోటును నది గర్భం నుండి బయటకు తీసేందుకు సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది.

Related posts