telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్ట్రగులింగ్‌ డేస్ ఎంజాయ్ చేయండి : పూరి

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ లో తాజాగా ‘స్ట్రగులింగ్‌ డేస్‌’ గురించి మాట్లాడారు. “అబ్రహం లింకన్‌ చాలా పేద కుంటుంబంలో పుట్టాడు. డబ్బుల్లేక ఓ సంవత్సరం మాత్రమే స్కూలుకెళ్లాడు. అంబేద్కర్‌ ఇంకా పేద కుటుంబంలో పుట్టాడు. వీధి దీపాల కింద చదువుకున్నాడు. స్టీవ్‌ జాబ్స్‌ తినడానికి తిండి లేక రోజూ నడుచుకుంటూ వెళ్లి హారే రామ హరే కృష్ణాలో తినేవాడు. మనందరికీ ఇలాంటి స్ట్రగులింగ్‌ డేస్‌ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు కన్నీళ్లు కూడా వస్తుంటాయి. మనకు ఎప్పుడు సక్సెస్‌ వస్తుందా? అని ఎదురుచూస్తుంటాం. ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నది అయిపోతుంది చూడు. అప్పుడే కష్టాలు మొదలవుతాయి. సక్సెస్‌ తర్వాత అసలైన స్ట్రగులింగ్ డేస్‌ మొదలవుతాయి” అన్నారు. పూరి ఇంకా ఏం చెప్పారో మీరు కూడా వినండి.

Related posts