telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు .. అనుమానాస్పద మృతి ..

agrigold vice chairmen died

వివాదాలలో ఏపీలో బాగా ప్రచారం పొందిన సంస్థ అగ్రిగోల్డ్. ఆ సంస్థ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. అగ్రిగోల్డ్ స్కాం నిందితుల్లో ఒకరైన వరప్రసాద రావు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పార్కింగ్ సమీపంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీనితో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించేలోపే ఆయన ప్రాణం విడిచారు. వరప్రసాద్‌ మృతిపై సికింద్రాబాద్‌ గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆయనది హఠాన్మరణమా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షరతులతో కూడిన బెయిల్‌ తో ఏపీలోనే కాదు తెలంగాణలో నమోదైన అగ్రిగోల్డ్‌ కేసులో డైరెక్టర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు తోటి డైరెక్టర్లతో కలిసి సోమవారం సదాశివ వరప్రసాద్‌ వచ్చాడు. స్టేషన్‌లో సంతకం చేసిన తర్వాత అందరూ కలిసి విజయవాడ వచ్చేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్కింగ్ దగ్గరకు రాగానే వరప్రసాద్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందారా ? లేకా మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. అయితే వరప్రసాద్ మృతిపై గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.

Related posts