telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్ లో ప్రారంభమైన 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్…

సాంకేతిక ఆవిష్కరణలు మరియు 5జీ రంగంలో భారతదేశపు ఇంజినీరింగ్‌ను నిర్మించే దిశలో స్మార్ట్ ఉపకరణాల బ్రాండ్ ఒప్పో.. హైదరాబాద్‌లోని తన ఆర్ అండ్ డీ సెంటర్‌లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నూతన ప్రయోగశాల 5జీ ఎకోసిస్టమ్‌కు మౌలిక ఉత్పత్తుల సాంకేతికతల అభివృద్ధిని మరింత లోతుగా చేయనుంది మరియు దేశ వ్యాప్తంగా దాని విస్తరణకు వేగాన్ని నింపనుంది. దేశంలో తన ప్రస్తుత ఇంజినీరింగ్ సంస్కరణలను, క్రియాశీలకం చేసే దిశలో నిర్మించిన ఒప్పో, తన మహోన్నత ఆవిష్కరణల నిబద్ధతను పూర్తి చేసేందుకు కొనసాగింపుగా కెమెరా, పవర్ మరియు బ్యాటరీ అలానే పనితీరు 3 రెట్లు పని చేయించేందుకు అనువుగా పని నిర్వహణ ప్రయోగశాలను కూడా ప్రారంభించనుంది. ఈ ప్రయోగశాలలు ప్రపంచానికి అత్యాధునిక మరియు మెరుగైన సాంకేతికతలను అందించడంపై దృష్టి సారించనున్నాయి. భారతదేశానికి చెందిన బృందాలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ ఆసియా, జపాన్ మరియు ఐరోపాలతో కూడిన ఇతర దేశాలకూ ఆవిష్కరణలకు నేతృత్వాన్ని వహించనున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌స్తున్నట్లు ప్రక‌టించారు. హైద‌రాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ వ‌స్తుంద‌ని తెలిపారు. ఇది దేశంలోనే మొద‌టి 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ అని పేర్కొన్నారు.

Related posts