ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల కరోనా పరీక్ష చేయించుకున్న రకుల్‌కు దాని ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి. ప్రస్తుతం రకుల్ క్వారంటైన్‌లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అందరితో దీనిని పంచుకోవాలసిన బాధ్యత నాకుంది. ప్రస్తుతం నాకేమీ అస్వస్థత లేదు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. తరువాత మళ్లీ నేను చిత్రీకరణలో పాలుపంచుకుంటాను. దాంతో పాటుగా ఇటీవల నన్ను కలిసి వారు కూడా కరోనా పరీక్ష చేయించుకోవలసిందిగా కోరుకుంటున్నాన’ని తన ట్విటర్‌లో రాశారు. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో శామ్ జామ్‌లో కనిపించి అందరిని అలరించారు. ఈ షోకు రకుల్ దర్శకుడు క్రిష్‌తో కలిసి వేదికను అలంకరించారు. అయితే రకుల్ త్వరగా కోలుకోవాలని ఆమె స్నేహితులతో సహా ఎంతో మంది కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.