రాజ్యాంగ బద్దంగా సభ జరగడం లేదని టీడీపీ సభ్యులు ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలోకి మార్షల్స్ ను రప్పించి సభ్యులను బయటకు పంపించండి అంటూ సీఎం చేసిన ప్రకటనను వారు తప్పుపట్టారు. అసలు అసెంబ్లీలోకి మార్షల్స్ ను స్పీకర్ అనుమతి లేకుండా ఎలా రానిస్తారని ప్రశ్నించారు.
సభ్యులను సస్పెండ్ చేయకుండా మార్షల్స్ తో వారిని ఎలా బయటకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్‌కు ఉన్న అధికారాలను కూడా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేజిక్కించుకుని రూలింగ్ లు ఇస్తున్నారని టీడీపీ మండిపడింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది: లక్ష్మణ్