telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై లీగల్ యాక్షన్ : సీపీ సజ్జనార్

cp sajjanar on disa accused encounter

దుబ్బాక గెలుపు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ లో ఊపు వచ్చిన విషయం తెలిసిందే. ఇక గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస కు బీజేపీ నే ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. అయితే తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలే కాదు.. అప్పుడప్పుడు.. అధికారులను కూడా మధ్యలోకి లాగుతున్నారు.. పోలీసులు, ఇతర అధికారులపై కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. ఇక, ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సైబరాబాద్ పోలీస్ కమిషన్ సజ్జనార్.. పోలీసుల మీద, డీజీపీ మీద కామెంట్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందంటూ ఎద్దేవా చేసినా ఆయన.. బీజేపీ నేతలు పోలీసుల మీద అనవసర ఆరోణలు చేస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించిన సీపీ సజ్జనార్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. బీజేపీ నేతలు పోలీస్ మొరాలిటీ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన సజ్జనార్.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదురుకోకతప్పదని హెచ్చరించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts