telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈ సారి సెంచరీ ఖాయం అంటున్న కేటీఆర్…

ktr trs

జీహెచ్‌ఎంసీ లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.. గత ఎన్నికల్లో సెంచరీ చేయలేకపోయిన టీఆర్ఎస్… ఈ సారి సెంచరీ కొట్టడం ఖాయం.. 105 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక, ఇవాళ నామినేషన్ల పర్వం ముగియగా.. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… ముందుగా.. అభ్యర్థులు… టికెట్లు కోసం పోటీపడిన వారిని కలవాలి.. డివిజన్‌లోని అందరు నాయకులను కలవండి… టికెట్ల కోసం పోటీపడిన వారిని కలసి మీతో కలసి రావాలని కోరండి అని చూసించారు. ఇక, ఇవాళ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు కేటీఆర్.. రేపే వాటిని అధికారులకు అందజేసి.. ఆ తర్వాత జనంలోకి వెళ్లాలని.. హైదరాబాద్‌లో ప్రజలకు ప్రగతిని నివేదించాలని కోరారు. ఇక, హైదరాబాద్ ప్రజలకు తాగునీటి గోసను తప్పించింది టీఆర్ఎస్ సర్కారే అని గుర్తు చేశారు కేటీఆర్..  24 గంటల నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరంలో కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందన్న ఆయన.. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆరేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఏ లొల్లి లేదన్నారు. మరోవైపు.. పెట్టుబడులు వరదాల హైదరాబాద్ కు వస్తున్నాయని వెల్లడించారు కేటీఆర్.. ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ.. హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎలా వస్తున్నాయి అని ఆరా తీశారన్న ఆయన.. హైదరాబాద్ లో అశాంతి చెలరేగితే మొత్తం తెలంగాణ రాష్ట్రమే దెబ్బ తింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కలవండి… మద్దతు కోరండి..  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చెప్పండి… మీకు అండగా ఉంటామని అని అభ్యర్థులకు సూచించిన కేటీఆర్.. రాబోయే 10 రోజులు… 24 గంటలు పనిచేయండి.. నిర్విరామంగా పనిచేయండి అని సూచించారు. చూడలి మరి ప్రజలు ఏం  తీర్పు ఇస్తారు అనేది.

Related posts