telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

యూకే నుండి హైదరాబాద్‌కు 358 మంది రాక…

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూకేలో మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ వెరియెంట్‌ కలవరపెడుతోంది.. అందే కాదు.. ఇతర దేశాలకు కూడా పాకుతోంది ఈ వైరస్.. ఇప్పటికే భారత్‌లోనూ అడుగుపెట్టింది… అయితే, ఇదే తరుణంలో యూకే నుంచి తెలంగాణ, హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు కలవరపెడుతోంది… ఇక, కొత్త వైరస్‌, కేంద్రం సూచనలతో మీడియాతో మాట్లాడిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. యూకేలో డిటెక్ట్ అయిన కరోనా వైరస్ వెరియెంట్ పై కేంద్రం సూచనలు వచ్చేశాయని తెలిపిన ఆయన.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. యూకే నుంచి సోమవారం రోజు ఏడుగురు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చారన్న ఆయన.. ఈ నెల 15 -21 తేదీల మధ్య మొత్తం 358 మంది ప్రయాణికులు యూకే నుంచి హైదరాబాద్ వచ్చారని తెలిపారు. వారం నుంచి హైదరాబాద్ లేదా తెలంగాణకు వచ్చిన వారు 040-24651119 నెంబర్ కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, కరోనా కొత్త వెరియెంట్ గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కొత్త కరోనా వెరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోందన్న ఆయన.. కానీ, దీనితో మరణాలు చాలా తక్కువగా ఉంటున్నట్టు సమాచారం ఉందన్నారు.

Related posts