telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ సంజన గల్రాని ఇంట్లో సీసీబీ సోదాలు

Sanjana

కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగా పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసారు. మరికొంతమంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సంజన గల్రాని ఇంట్లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ కేసులో డ్రగ్స్ డీలర్స్‌తో తనకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావడంతో సీసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సంజన ఈవెంట్ మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారంతో ఇందిరానగర్‌లోని ఆమె ఇంట్లో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆధారాలు దొరికితే సంజనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా సంజన ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా తరవాత ఒకటి అరా తెలుగు సినిమాల్లో నటించింది కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆ తర్వాత ఈ భామ అడపాదడపా హిందీ ,కన్నడ, మలయాళంలో నటిస్తున్న సినిమాలు చేస్తూ అలరిస్తుంది.

Related posts