telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టైయిలీస్‌ లుక్‌ లో నాగశౌర్య…

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో నాగ శౌర్య కు జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత సౌజన్య దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూట్ హైదరాబాద్ పరిసరాల్లో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శౌర్య సరసన పెళ్లిచూపులు ఫెమ్ రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు “వరుడు కావలెను” అనే టైటిల్ ను పెట్టారు. ఈ మూవీ తదుపరి షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ దుబాయి పయనమయ్యారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా ఎయిర్‌ పోర్టులో నాగశౌర్య ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోల్లో నాగశౌర్య క్యాప్‌ పెట్టుకుని స్టైయిలీస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Related posts