telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్‌లో తగ్గని కరోనా..94 లక్షలకు చేరువలో కేసులు

corona vaccine covid-19

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 93 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 41,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 496 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 42,298 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,92,920 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,53, 956 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88, 02, 267 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,36, 696 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.68 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5. 44 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 12,83,449 కు చేరింది.

Related posts