పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. వెలగపూడి సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు ఈ ఉదయం నిరసనకు దిగడంతో, ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు.
మంగళగిరిలో నిరసన తెలిపిన నారా లోకేశ్, ఇతర పార్టీ నేతలతో కలిసి పల్లె వెలుగు బస్సెక్కి సచివాలయం వరకూ వచ్చారు. లోకేశ్ తో పాటు దీపక్ రెడ్డి, అశోక్ బాబులు కూడా అదే బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో మాట్లాడిన లోకేశ్, పెంచిన చార్జీలు సామాన్యులపై చూపించే ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు ధర్నా చేస్తుండటంతో, సచివాలయం ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం: అంబటి