telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

బులియన్‌ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లలో బంగారం ధర గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 50,080 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 45,890 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. .47,730 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 43,750 పలుకుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 1,300 తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 74,400 వద్ద ఉన్నది.

Related posts