telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పురుడు పోసిన…. రక్తపు ముద్ద రూపమే నీవు

గర్భాన నవమాసాలు మోసి
పురిటి నొప్పులు భరించి
ఉమ్మనీరు నుండి తేల్చి
పురుడు పోసిన
రక్తపు ముద్ద రూపమే నీవు
ఆ నీవే….!!
స్త్రీకే పుట్టి
స్త్రీ చేతుల్లోనే పెరిగి
తాగిన రొమ్ముపాలనే మరిచి
ఆ రొమ్మునే కామావిందుగా
చేసుకుంటూ
తల్లిని,చెల్లిని కూడా కామిస్తూ
వికృతక్రీడల వింత వినోదంతో
రక్కసి కేకల పైశాచిక నినాదంతో
కళ్ళకి కామపు పొరలు కమ్ముకుని
కౌరావుల సంతతి దుస్సాశనుడివై
స్త్రీల మాన ప్రాణాన్ని చెరబడుతున్నావు
తస్మాత్ జాగ్రత్తా….!!
నేటి ఆడకూతుళ్లు శాంతికే సీతలు
సమరానికే సత్యభామలు
భద్రకాళిగా రూపమేత్తి
క్షుద్రకేళిని అంతమోందించగల
శక్తి రూపాలై నిన్ను సంహారిస్తారు
తస్మాత్ జాగ్రత్త….!!
ఓ కామ కొడుకా
ఇది నీ అంతమే
అలా జరగకముందే
అమ్మ తత్వాన్ని అలవరుచుకో
ప్రతి స్త్రీ నీతల్లి రూపమే అని తెలుసుకో
మానవత్వాన్ని కలిగిన మనిషిగా మసులుకో…..

Related posts