telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం ఉల్లిగడ్డలు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

ప్రస్తుత పరిస్థితిల్లో మనం ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం.. కాదు.. కాదు చాలా అవసరం. కరోనా వచ్చిన తర్వాత… చాలా మంది ఆరోగ్యం పై చాలా ద్రుష్టి పెట్టారు. ఆరోగ్యం కాపాడుకోవడం.. పండ్లు, ఫలాలు తిన్నారు. అయితే.. వాటి కంటే మనకు నిత్యం.. విరిగిగా దొరికే ఉల్లిగడ్డలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులోను ఎండాకాలం తింటే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిగడ్డ ఉపయోగాలు…

ఇది శరీరానికి చలువ చేయును . ఉష్ణ శరీరం కలవారు , మేహప్రకృతి కలిగినవారు , మొలల సమస్య ఉన్నవారు , అతిసారము , రక్తాతిసారం , గ్రహణి రోగము , ఉబ్బురోగం , మలమూత్ర బద్దకం కలిగినవారు దీనిని సేవించిన మంచి ఉపశాంతి కలుగును. పిత్తప్రకోపములు ఇది తగ్గించును . ఆకలి పెంచును . అగ్నిదీపనం చేయును . ఇంద్రియాలకు ఉత్సాహం కలిగించును. రక్తమును శుభ్రపరచును . శ్వాస , కాస , శ్లేష్మము , వాతములను పోగొట్టును . వీర్యవృద్ధికరము , ఈ గడ్డలు దంచి రసము తీసి ఒంటికి పూసిన దురదలు తగ్గును. తేళ్లు , కందిరీగలు కుట్టినచోట ఈ రసము పూసిన బాధ తగ్గును. రసము చెవిలో పోసిన చెవిపోటు తగ్గును . ఈ రసము ఆవనూనెతో కలిపి మర్దన చేసిన మేహ వాత నొప్పులు తగ్గును . 

ఈ రసము 20ml తాగించి ఉల్లిగడ్డ నూరిన ముద్దను వాసన చూపించి కాటు వేసినచోట వేసి కట్టు కట్టిన ఎంతటి విష సర్పములు , వెర్రి కుక్కలు , తేళ్లు , మండ్రగబ్బల విషం అయినను విరిగిపోయి బాధ తగ్గును.    15ml రసములో పంచదార చేర్చి లోపలికి తీసుకున్న మొలల రోగం నివారణ అగును. ఈ రసం మిరియాల పొడితో పుచ్చుకున్న జ్వరములు , పురాణ జ్వరములు నశించును. ఈ రసమును కాటుకలా కంటికి పెట్టుకొనుచున్న రేజీకటి తగ్గును. ఉల్లిగడ్డ రసం ముక్కుతో లోపలికి పీల్చిన నాసికా రోగములు నివారణ అగును. గడ్డలు , వ్రణములకు ఈ గడ్డను ఉడికించి కట్టిన త్వరగా తగ్గును. 

 ఉల్లిగడ్డను అమితముగా తీసుకోరాదు . మేహ , ఉష్ణ ప్రకృతి కలిగిన వారికి మత్తు కలిగించును. తలనొప్పి , పార్శ్వపు నొప్పి కలిగించును . ఉలిగడ్డను సరాసరి తినరాదు. మజ్జిగ అన్నంతో కలిపి తినటం మంచిది.

Related posts