telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ప్రపంచం ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలోకి వెళ్లిన ఎలాన్…

కరోనా కారణంగా ప్రపంచమంతా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు… ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  కరోనా సమయంలో అనేక రంగాలు మూతపడటంతో ప్రజలు ఆర్ధికంగా కుదేలవయ్యారు.  అయితే, కొంతమంది వ్యక్తుల సంపాదన మాత్రం కరోనా సమయంలో భారీగా పెరిగింది.  వేల కోట్ల రూపాయలు సంపాదించారు.  అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఎలాన్ మాస్క్ ఒకరు.  టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు టెస్లా కంపెనీకి చెందిన షేర్లు 8 శాతం పెరగడంతో ప్రపంచంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.  ఎలాన్ నికర సంపాదన విలువ 195 బిలియన్ డాలర్లు.  అంటే దాదాపుగా రూ. 14,23,500 కోట్లు.  మొన్నటి వరకు ప్రపంచంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ను వెనక్కి నేటి టాప్ ప్లేస్ లో నిలిచాడు ఎలాన్.  2017 వ సంవత్సరం నుంచి జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటె, ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న ఎలాన్ సంపాదన ఏడాది కాలంలో 150 బిలియన్ డాలర్లు పెరిగింది.  అంటే గంటకు సుమారుగా రూ.127 కోట్ల రూపాయల సంపాదనగా చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా నిమిషానికి 2 కోట్లకు పైనే అన్నమాట.

Related posts