తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా నియామాకాల్లో జీసీలకు కోటా కల్పించాలని గవర్నర్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్సిలర్ పోస్టుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం పోస్టులను కేటాయించాలని గవర్నర్‌ను కోరారు. యూనివర్సిటీ చాన్సిలర్ నియమాకంలో జోక్యం చేసుకొని జీసీలకు కోటా కల్పించాలని కోరారు.
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. సమర్ధులైన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు.
రద్దుల ప్రభుత్వంలా వైసీపీ సర్కారు: చంద్రబాబు