telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాసేప‌ట్లో పెద్దపల్లికి సీఎం కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

ముందుగా హైదరాబాదు నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా పెద్దపల్లికి చేరుకోనున్న ఆయన రాజీవ్ రహదారికి ఆనుకొని పెద్దకల్వల వద్ద నూతనంగా దాదాపుగా 49 కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

తిరిగి అక్కడి నుండి మంథని వైపు వెళ్లే రహదారి పక్కన నిర్మించిన టీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు .ఆ తరువాత పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి రెండు గంటలకు పెద్దకల్వ లలో 50 ఎకరాల విస్తీర్ణంలోని ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

 

 

Related posts