telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హల్ చల్ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ఆడియో టేప్…

Mallareddy Trs

ఓ రియల్టర్‌ను మంత్రి మల్లారెడ్డి బెదిరించిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి బెదిరించి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తన వాటా సంగతి ఏంటి? అంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్న ఆడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది..  వెంచర్ వేసినందకు తనకు మామూళ్లు ఎందుకు ఇవ్వలేదు? అంటూ రియల్టర్‌ను ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి.. అయితే తాను సర్పంచ్‌కు మామూళ్లు ఇచ్చానని చెప్పాడు రియల్టర్.. సర్పంచ్‌కు ఇస్తే సరిపోదని.. ఎమ్మెల్యేకు, తనకు కూడా మామూళ్లు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగారు.. అంతేకాదు.. మామూళ్లు ఇచ్చేవరకు వెంచర్ ఆపేయాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. 50 ఎకరాల్లో వెంచర్ నడుస్తోంది.. దానికి సర్పంచ్‌కు ఇచ్చి పనిచేసుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. వాడి గురించి కలెక్టర్‌కు చెప్పి పొట్టుపొట్టు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది.

Related posts