telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ మంత్రి పేర్ని నాని పై అటాక్…

perni Nani ycp

ఏపీ మినిస్టర్ పేర్ని నానిపై ఘటన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో  అన్ని జిల్లా లో మంత్రులు , నివాసం కార్యాలయాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన మరో మంత్రి కొడాలి నాని నివాసం వద్ద మెటల్ డిక్టర్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. గుడివాడ  పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నివాసాన్ని భద్రతా అధికారులు వారి అధీనంలో కి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నివాసంలో డాగ్ స్క్వాడ్ తో అణువణువునా పరిశీలించారు. మంత్రి కొడాలి నాని నివాసం లో మెటల్ డిటెక్టర్ ఎర్పాటు చేసి సందర్శకులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లోపలికి అనుమతిస్తున్నారు. బెజవాడ కమిషనరేట్ పరిధిలో కూడా ఇదే విధంగా మంత్రుల నివాసాల దగ్గర భద్రతను పరిశీలించారు. ఇప్పటి వరకు నిందితుడి కాల్ డేటా ద్వారా టీడీపీకి ఉన్న లింకులను విశ్లేషించే ప్రయత్నం చేసిన అధికారులు, కస్టడీ ద్వారా విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలుస్తాయని బావిస్తున్నారు. గతంలో జరిగిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యకు మాదిరిగానే ఈ ఘటనకు సంబంధించి కూడా టీడీపీకి సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ జరిగితే కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts