కేంద్రం ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో ఉపశమనం కలిగించే దిశగా ముందడుగు వేసింది. సుమారు లక్ష టన్నుల ఉల్లిపాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాసవాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఉల్లి ధరల్ని నియంత్రించడానికి లక్ష టన్నులను విదేశాల దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఉల్లిపాయలు దిగుమతులు చేసుకుని మార్కెట్లలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వాణిజ్య సంస్థ ఎంఎంటీసీకి సూచించింది. దిగుమతి చేసుకున్న వాటిని దేశమంతా సరఫరా చేసే బాధ్యతలు నాఫెడ్ సహకార సంఘానికి అప్పగించింది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నెల రోజులకు పైగా ఉల్లిపాయల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దిల్లీ మార్కెట్లో ఉల్లి ధర కిలోకు రూ.100 ఉండగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ.60 నుంచి 80 పలుకుతుండటం గమనార్హం.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్