telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి స్పందన…

ప్రస్తుతం ఏపీలో విశాఖ స్లీట్ ప్లాంట్‌ రగడ నడుస్తుంది.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతీ పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని ఆయన వెల్లడించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను మాత్రమే నీతీ ఆయోగ్ సూచనల మేరకు ప్రైవేటీకరణ చేస్తామని అనురాగ్ సింగ్ తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం పోలవరం ప్రాజక్టుకు నిధులు కేటాయిస్తున్నామన్న ఆయన ఈ మధ్య కాలంలో ఏపీ ఆర్థికమంత్రి పోలవరం నిధులపై మూడు సార్లు కలిశారన్నారు. ఇక కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదన్న ఆయన బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని అనురాగ్ సింగ్ తెలిపారు. ఇక విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిర్వాసిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. 9వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా ప్రయివేట్ చేతుల్లో ప్లాంట్ పెడితే సహించేది లేదంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts