telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియల్‌ మేన్‌లా చూడట్లే … చిన్నపిల్లాడిగానే చూస్తున్నారు

Vijay-Devarakonda

‘బి ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ చాలెంజ్‌ను విజయవంతగా పూర్తిచేశారు. హీరో ఎన్టీఆర్‌ను చాలెంజ్‌ స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ.. టాస్క్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చాలెంజ్‌కు ఆయన సన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేశారు. దీనికి విజయ్‌ తనదైన శైలిలో జవాబిస్తూ విజయ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘శివ సార్‌, మా అమ్మ నన్ను పని చేయనియట్లే. ఎందుకంటే పని రెండింతలు అవుతుందంటా. ఇంట్లో ఇంకా రియల్‌ మేన్‌లా చూడట్లే మమ్మల్ని ఇంకా పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌లో నేను చేసే పనిని అందరికి చూపిస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు. విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్యా పాండే నటిస్తున్నారు.

Related posts