telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం: సీఎం జగన్

cm jagan ycp

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లక్షా తొమ్మిది వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. జగన్ బటన్ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమయ్యాయి.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘కరోనా’పై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయన్నారు. మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించడం వల్లే వారికి సాయం చేస్తున్నామని అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునే నిమిత్తం ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారులతో జగన్ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మోపిదేవి వెంకటరమణ, పలువురు మంత్రులు, సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్లు పాల్గొన్నారు.

Related posts