telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బీజేపీ ఎంపీ సుజనా వ్యాఖ్యలను ఖండించిన కార్మిక సంఘాలు…

విశాఖ స్లీట్ ప్లాంట్‌ కాపాడుకోవడానికి అంతా సిద్ధమవుతున్నారు.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఇప్పుడు.. తన పదవికి రాజీనామా చేసిన కాకపెంచారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. అన్ని పార్టీల వారు కూడా రాజీనామా చేయాలని.. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత తమదేనని పిలుపునిచ్చారు.. మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పరిణామాల పై కార్మిక సంఘాల సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి CITU, INTUC, AITUC, YSRTUC, TNTUC,HMS కార్మిక సంఘాలు హాజరయ్యాయి. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమానికి సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు, MP, MLA లకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగే అఖిల పక్ష ధర్నాకు వైజాగ్ నుంచి బృందం వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారని నేతలు అభిప్రాయ పడ్డారు. ఇక బీజేపీ ఎంపీ సుజనా వ్యాఖ్యలను కార్మిక సంఘాల ఖండించాయి. సుజనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సంఘాల డిమాండ్ చేశాయి. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమానికి కార్మిక సంఘాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

Related posts