telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గుడివాలో ఉద్రిక్త పరిస్థితులు..సోమువీర్రాజు అరెస్ట్

ఏపీలోని గుడివాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడలో జరిగిన కేసినో అంశాన్ని నిగ్గు తేల్చేందుకు బిజెపి ఛలో గుడివాడ కార్యక్రమాన్ని చేప్పటింది. బీజేపీ బృందం విజయవాడ నుంచి వెళ్లింది.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. గుడివాడ వెళ్లకుండానే దారిలోనే వాహనాలు నిలిపివేశారు.

పోలీసులు తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహానికి గురయి భారీకేడ్లను తోసుకుని ముందుకు వెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజుతో పాటు నాయకులు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసారు. సంక్రాంతి సంబరాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులతో సోము వీర్రాజు వాగ్వాదానికి దిగారు.

దీంతో బీజేపీ నేతలు గుడివాడలో తాజాగా జరిగిన కేసినో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము గుడివాడకు సంక్రాంతి ముగింపు ఉత్సవాలకు వెళ్తున్నామని.. కేసినో అంశంపై కాదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తెలుగు సంస్కృతిని దెబ్బతీస్తూ గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్న కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.

మ‌రోవైపు ఈ ఘటనపై తోట్ల వల్లూరు పోలీసు స్టేషన్ వద్ద బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్,విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… పోలీసులు, వైసిపి కార్యకర్తకు పెద్ద తేడాలేదన్నారు. అక్రమ అరెస్టులతో వైసిపి ప్రభుత్వం ఉద్యమాలను అపలేదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నేతలను భేషరతుగా విడుదల చేయాలని… మంత్రివర్గం నుండి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని విష్ణువర్థన్ డిమాండ్ చేసారు.

Related posts