కరోనా పోరులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన వేతనంలో సంవత్సరం పాటు 30 శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చానని రాష్ట్రపతి రాంనాథ్ కు లేఖను రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతున్నదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అర్ధికపరమైన వెసులుబాటు తప్పనిసరని సూచించారు.
ఇప్పటికే పార్లమెంటు సభ్యుల నిధులను (ఎంపీ లాడ్స్) రద్దు చేసిన కేంద్రం, వారి జీతాల్లోనూ కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా తన వేతనం నుంచి 30 శాతం మొత్తాన్ని మినహాయించి, ఆ డబ్బును కరోనా కట్టడికి వెచ్చించాలని బిశ్వభూషణ్ హరిచందన్ లేఖలో పేర్కొన్నారు.