ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్‌ఎఫ్‌కు చెందిన కోబ్రా 206 బెటాలియన్ జవాన్లు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం గాలింపు చేపట్టారు. ఈ క్రమం లోనే తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మారోయిస్టులు పేల్చి వేశారు. దీంతో కోబ్రా బెటాలియన్‌లోని ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అసిస్టెంట్ కామాండెంట్ నితిన్ భలేరావు మాత్రం మరణించారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. మిగతా ఏడుగురు ప్రమాదంలో లేరని పోలీసులు చెప్పారు. మావోయిస్టుల ఆగడాలకు చెక్ పెట్టి… వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు పేర్కొన్నారు.
previous post