సూపర్ స్టార్ కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అశోక్ గల్లా లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాలోని సాంగ్ టీజర్‌ను వదిలారు. కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం (మే 31) ఈ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. నిజానికి అది ‘యమలీల’ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ చేసిన సూపర్ హిట్ సాంగ్ ‘జుంబారే’కు రీమిక్స్. లెజండ్ అయిన తన తాతయ్యను ఈ పాటలో అశోక్ గల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆకట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్, సెట్స్ పాటకు సరిగ్గా సరిపోయాయి. ఆ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం మెరిశారు. అయితే, ఈ వీడియోకు మహేష్ బాబు కూడా ఫిదా అయిపోయారు. తన మేనల్లుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు. ‘‘ఈ సాంగ్‌లో ఉన్న ఎనర్జీలో నువ్వు జీవించేశావు అశోక్. నీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నీ నటనను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. నీకు, నీ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాక్ ఆన్’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపించారు.
You totally lived up to the energy of this song @AshokGalla_ 😍 Love your screen presence❤️❤️ Can’t wait to see you in action! Sending my best wishes to you and the entire team! Rock on👊🏻 pic.twitter.com/hquN1hBKXh
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2020