telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

60 సంవత్సరాల “బొబ్బిలి యుద్ధం”.

పద్మశ్రీ ఎన్.టి.రామారావు నటించిన చారిత్రాత్మక చిత్రం “బొబ్బిలి యుద్ధం” సినిమా 4 డిసెంబర్ 1964న విడుదలయ్యింది. రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సీతారామ్ నిర్మించారు.

ఇది ఒక వీరోచితంగా చారిత్రిక కథ . 1757 జనవరి 24 న బొబ్బిలి సంస్థానం, ఫ్రెంచి, విజయనగర సంస్థానం మధ్యన జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా నిలిచిపోయింది . ఈ కథను సీతారాం సినిమాగా మలిచారు .
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, భానుమతి, జమున, సీతారాం, రాజనాల, బాలయ్య, యమ్.ఆర్.రాధ, ముక్కామల,పద్మనాభం, నాగయ్య, ఎల్. విజయలక్ష్మి, జయంతి, గీతాంజలి, ధూళిపాళ, కె.వి.యస్.శర్మ, ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు కాంతారావు, రాజ బాబు, సురభి బాలసరస్వతి నటించారు.

రాజా రంగరాయలుగాఎన్ .టి. రామారావు, మల్లమ్మ దేవిగా భానుమతి, తాండ్రపాపారాయుడుగా ఎస్ .విరంగారావు, విజయ రామరాజుగా రానాల,  ఎమ్ .ఆర్ .రాధ, సుభద్రగా జమున, వెంగళరాయుడుగా సీతారాం ఎంతో ప్రతిభావంతంగా నటించారు.

ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే: సీతారాం, మాటలు: గబ్బిట వెంకట్రావు, మాటలు పర్యవేక్షణ: సముద్రాల రాఘవాచార్య, పాటలు: శ్రీ శ్రీ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, కొసరాజు సముద్రాల, గబ్బిట వెంకటరావు, సంగీతం: ఎస్.రాజేశ్వరరావు, ఫోటోగ్రఫీ: కమల్ ఘోష్, నృత్యం; వెంపటి సత్యం, పసుమర్తి వేణుగోపాలం, కళ: గొడ్ గాంకర్ ఎడిటింగ్: కందస్వామి, అందించారు.

నిర్మాత సీతారాం ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయసాలు తో నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా కొలిచే వీరబొబ్బిలి గాథకు మహాకవి శ్రీ శ్రీ సాహిత్యంతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం విజయానికి దోహదం చేసింది .

“ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క”
“శ్రీ కర కరుణాలవాల వేణుగోపాల”
“అందాల రాణివే”
“మురిపించే అందాలే ”
వంటి మదురమైన పాటలు శ్రోతలను అలరించాయి.
దేశభక్తి మేళవించి చిత్రీకరింపబడిన ఈ చిత్రాన్ని కి
ప్రేక్షకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు కూడా ఈ సినిమాకు దక్కాయి .

Related posts