రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ఇది ఇలా ఉండగా.. గోపీచంద్… మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చేప్పారు. అయితే గోపీచంద్- మారుతి దర్శకత్వంలో రానున్న సినిమా హిందీ జానీ-ఎల్ఎల్‌బీ సినిమాకి రీమేక్‌కా తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి పక్కా కమర్షియల్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎవరు చేయనున్నారన్న విషయం పై క్లారిటీ రాలేదు. తాజాగా మారుతి ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నాను ఫిక్స్ చేయాలని చూస్తున్నారంట. మారుతి గత సినిమా ప్రతి రోజు పండగే సినిమాలో రాశీ పనితీరు నచ్చడంతో ఈ సినిమాలో కూడా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారంట. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అతి త్వరలో వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
previous post
నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్