telugu navyamedia
క్రీడలు వార్తలు

హెచ్‌సీఏ ఏజీఎం సమావేశంలో గందరగోళం…

ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రసాభాసగా మారింది. అసోసియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ మాట వినకుండా హెచ్‌సీఏ క్లబ్ కార్యదర్శులు గందరగోళం రేపారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏజీఎంను ఏమాత్రం అదుపు చేయలేకపోయారు. వార్షిక సర్వసభ్య సమావేశానికి మొత్తంగా 186 మంది క్లబ్ సెక్రటరీలు హాజరయ్యారు. క్రికెట్‌ అజెండాగా సాగాల్సిన ఏజీఎం కాస్తా చివరకు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మారింది.ఏజీఎంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నువ్వు ఫిక్సర్‌.. నువ్వు దొంగ అంటూ తిట్టుకున్నారు. మహ్మద్‌ అజహారుద్దీన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏజీఎం అసంపూర్తిగా ముగిసింది. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్ ‌వర్మ నియామకం విషయంలో పెద్ద గొడవ జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ కూడా హాజరయ్యారు. అయితే ఆయన సమావేశం నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. ఇక అంబుడ్స్‌మన్‌ నియామకంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏప్రిల్‌ 11కు ఏజీఎం వాయిదా పడింది.

Related posts