ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చి సులువుగా గెలిచే మ్యాచ్‌ను సంక్లిష్టం చేసుకున్నారు. దాంతో భారత ఫీల్డింగ్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంగ్లండ్.. భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న మైకేల్.. తాజా మ్యాచ్‌పై కూడా తనదైన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టు కోసం ఈ వారం నా ఫీల్డింగ్ క్రికెట్ అకాడమీని ఓపెన్ చేసినందుకు భయపడుతున్నాను’అని సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డింగ్ గురించి నువ్వే మాట్లాడాలి ఇక అంటూ.. అతని పాత వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో సునాయస క్యాచ్‌లను మైకేల్ వాన్ నేలపాలు చేశాడు. అంతేకాకుండా నీ కన్నా భారత ఆటగాళ్లు బాగానే చేస్తున్నారని చురకలంటిస్తున్నారు. ‘ముందు నుంచి వెళ్లే బంతులను కూడా ఆపలేవు.. నువ్వా ఫీల్డింగ్ గురించి మాట్లాడేది’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంగ్లండ్.. భారత్ పర్యటన ఆద్యాంతం ఆకట్టుకుందని, అసలు సిసలు మజా లభించిందని వాన్ మరో ట్వీట్ చేశాడు.
previous post
next post